GST ప్రభావం వల్ల తమిళనాడు లోని సినిమా థియేటర్లన్నీ మూసివేత
జీఎస్టీ పేరుతో తమపై వేసిన భారాన్ని మోస్తూ థియేటర్లు నడిపే సామర్థ్యం లేదని, అందుకే నేటి నుంచి తమిళనాడులోని సినిమా థియేటర్లను మూసివేస్తున్నామని థియేటర్ల యాజమాన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదివారం థియేటర్స్ అధ్యక్షుడి ఇంట్లో చర్చలు జరిపిన యజమానులు, అనంతరం ఇవాళ నుండి థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.., తాము ఎవరికీ వ్యతిరేకంగా పని చేయడం లేదని, తమ ఆవేదనను ఇలా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పేందుకు, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని తెలిపేందుకే థియేటర్లను మూసేస్తున్నామని వారు తెలిపారు. జీఎస్టీ భారం తగ్గించేవరకు థియేటర్లు తెరిచేది లేదని వారు తేల్చిచెప్పారు.
Comments
Post a Comment