మోహన్ లాల్, విశాల్ భారీ చిత్రం
ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం విలన్ . మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హీరోయిన్ హన్సికలతో పాటు తెలుగు స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. విలన్ చిత్రంలో మోహన్ లాల్.. మాథ్యూ మనోరంజన్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా మంజూ వారియర్ నటిస్తుంది.

Comments
Post a Comment