రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
రాష్ట్రపతి ఎన్నిక: ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 పాయింట్లు
న్యూఢిల్లీ: 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ పత్రాలు ఢిల్లీకి వెళ్తాయి.
ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్ కోవింద్, విపక్షాల నుంచి మీరా కుమార్ పోటీలో ఉన్నారు.
ఈ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పత్రాలపై ఓట్లు వేస్తారు. శాసనసభ్యుల కోసం గులాబీ రంగులో బ్యాలెట్ పత్రాలు ముద్రించారు.
ఎంపీల ఓట్లకు స్థిర విలువ ఉంది. శాసనసభ్యుల ఓట్లకు మాత్రం వారి వారి రాష్ట్రాలను బట్టి విలువ మారుతుంది. కాబట్టి వేర్వేరు రంగుల బ్యాలెట్లను సిద్ధం చేశారు.
రాష్ట్రపతిని ఎన్నుకునే అర్హత 4,896 మంది ప్రజా ప్రతినిధులకు ఉంది. నామినేటెడ్ సభ్యులు మినహా మిగిలిన చట్టసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు.
ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 పాయింట్లుగా ఉంటుంది. మొత్తం ఓట్లు 10,98,903. ఎంపీల ఓట్లు 5,49,408, ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,495. 543 మంది లోకసభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 4,120 మంది శాసన సభ్యులు ఉన్నారు.

Comments
Post a Comment