సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
బాబుతో భేటీ కానున్న పవన్…
రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మామూలుగా ఆదివారంలో చంద్రబాబును పవన్ కలవాలని భావించగా, రాష్ట్రపతి ఎన్నికల ఒత్తిడి నేపథ్యంలో, వీరిద్దరి భేటీ ఈ రోజుకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్ర చంద్రబాబు, పవన్ సమావేశం కానున్నారు.
ఇందులో ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చ సాగనున్నట్టు సమాచారం. ఇటీవలే హార్వార్డ్ యూనివర్శిటీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి వైద్యులను ఉద్దానం సమస్య పరిశీలనకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వైద్య బృందం ఇక్కడకు రానుండగా వారికి ఏర్పాట్లు తదితరాలపైనా పవన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఒకవేళ ఇవాళ కూడా కుదరకపోతే ఈ వారాంతంలోగా ఈ ఇద్దరు భేటీ అవ్వనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Comments
Post a Comment