హై కోర్టులో పిటిషన్ వేసిన ఛార్మి


హై కోర్టులో పిటిషన్ వేసిన ఛార్మి


ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గారు, కథానాయకుడు రవితేజ, సుబ్బరాజు , తరుణ్ , నవదీప్, ఛార్మి, ముమైత్ ఖాన్ తదితరులు ఉన్న విషయం తెలిసిందే.కాగా కొన్ని రోజుల నుండి ఒక్కక్కరుగా సిట్ విచారణకు హాజరవుతున్న విషయం కూడా తెలిసిందే.
ఇప్పటి వరకు పూరి, తరుణ్ ,శ్యామ్ కే నాయుడు , సుబ్బరాజు ,తరుణ్ తదితరులు విచారణకు హయరయ్యారు. కాగా ఈ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. విచారణతరువాత ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన తన ట్విట్టర్ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో మీడియా తన జీవితం నాశనం చేసింది అని చెప్పిన విషయం కూడా తెలిసిందే. కాగా ఆ తరువాత రోజు ఈ వీడియో పై నటుడు ప్రకాశ్ రాజ్ నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం తగదు అని స్పందించిన విషయం కూడా తెలిసిందే.
కాగా ఈరోజు తాజాగా ఈ విషయం మీద కథానాయిక ఛార్మి హై కోర్టును ఆశ్రయించారు. విచారణలో తమ ప్రమేయం లేకుండా రక్త నమూనాలు సేకరిస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ప్రకారం తమకు మానసిక క్షోభ పెడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఆ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. కాగా ఈరోజు మరొక నటుడు నవదీప్ సిట్ విచారణకు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు