వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు
వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ సంచలనం సృష్టించాడు. ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ ప్రపంచ ఐదో ర్యాంకర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ ఘనత సాధించాడు. తద్వారా ప్రపంచ టెన్నిస్‌లో వింబుల్డన్ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆషె (32 ఏళ్లు, 1976) రికార్డుని అధిగమించాడు. మరోవైపు పీట్ సంప్రాస్ (7 టైటిల్స్) రికార్డును అధిగమించాడు. మొత్తంగా స్విస్ ప్లేయర్‌కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అంతేకాదు 1976 తర్వాత వింబుల్డన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడు ఫెదరర్. 1976లో జాన్ బోర్గ్ తొలిసారి ఇలా నెగ్గాడు. ఫైనల్లో సిలిచ్ ఏ దశలోనూ రోజర్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు. అతను మూడు డబుల్ ఫాల్ట్స్, 23 అనవసర తప్పిదాలు చేశాడు. బలమైన ఏస్‌లు కొట్టడంలో దిట్ట అయిన సిలిచ్ ఐదు ఏస్‌లు, 16 విన్నర్లకే పరిమితంకాగా.. ఫెడెక్స్ 8 ఏస్‌లు, 23 విన్నర్లతో ఆకట్టుకున్నా...


Comments
Post a Comment