తన కుమార్తెకు డ్రగ్స్‌తో సంబంధం లేదు:ఛార్మి తండ్రి దీప్ సింగ్ ఉప్పల్
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న వారిలో హీరోయిన్ ఛార్మి కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు గురువారం ఆమెను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ వార్తలపై స్పందించారు ఆమె తండ్రి దీప్ సింగ్ ఉప్పల్. తన కుమార్తెకు డ్రగ్స్‌తో సంబంధం లేదని ఆయన అన్నారు.
“13 యేళ్ల వయసు నుండే ఛార్మి సినీ రంగంలో ప్రతిభ చాటుతోందని, చిన్ననాటి నుంచే కుటుంబానికి అండగా ఉంటోందని అన్నారు. అలాంటిది తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలతో మాత్రం తీవ్రంగా కలత చెందిందని, ఒకవేళ చార్మీకి డ్రగ్స్ అలవాటు ఉంటే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందా? అని ప్రశ్నించారు.
అలాగే ఛార్మీ తన తదుపరి చిత్రం పైసా వసూల్‌తో బిజీగా ఉందని, అయితే ఒకరిపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాసేటప్పుడు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. తనకు దర్శకుడు పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా తెలుసని, అతడు ఒక అద్భుతమైన దర్శకుడని, నిర్దోషిగా అతడు బయటకు వస్తారని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో త్వరలోనే ఛార్మీకి క్లీన్‌చిట్ వస్తుందని అప్పుడే అందరికి సమాధానం దొరుకుందని వ్యాఖ్యానించారు.

Comments
Post a Comment