ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్
ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్
భారత్‌లో అందుబాటులోకి తెచ్చిన ఇ-కామ్ సంస్థ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చిన్న జిఎస్‌ఎం ఫోన్‌గా చెబుతున్న ‘నానోఫోన్ సి’ దేశీయ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. రష్యా కంపెనీ ఎలారి తయారు చేసిన ఈ ఫోన్‌ను ఢిల్లీకి చెందిన ఇ-కామర్స్ సంస్థ యెర్హా డాట్ కామ్ విక్రయిస్తోంది. దీని ధర 3,940 రూపాయలు. 7.6 ఎంఎం మందం, 30 గ్రాముల బరువు ఉన్న ఈ ఫోన్‌లో 1 అంగుళం టిఎ్‌ఫటి డిస్‌ప్లే, 32జిబి మైక్రో ఎస్‌డి, మైక్రో సిమ్ కార్డు స్లాట్లు, ఎంపి3 ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియో, అలారమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఈ ఫోన్‌ను బ్లూటూత్‌తో పేర్ చేయవచ్చు. ఫలితంగా వచ్చిన కాల్స్‌ను మాట్లాడవచ్చు, అవసరమైతే కాల్స్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుంచి వెయ్యి వరకు కాంటాక్టులను ఈ ఫోన్‌లోకి కాపీ చేయవచ్చు. ఇందులో రెండు సిమ్ కార్డులను వాడవచ్చు. హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ వంటివి కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే నాలుగు రోజుల పాటు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

Comments
Post a Comment