శ్యామ్ కె.నాయుడి సిట్ విచారణ పూర్తి
శ్యామ్ కె.నాయుడి సిట్ విచారణ పూర్తి
డ్రగ్స్ వ్యవహారం లో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరు సిట్ ఆఫీస్ లో విచారణ ను ఎదురుకొంటున్నారు..నిన్న దాదాపు 11 గంటల పాటు డైరెక్టర్ పూరి ని విచారించి సిట్ అధికారులు , ఈరోజు కెమెరామెన్ శ్యామ్.కె.నాయుడు ను విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు సిట్ ఆఫీస్ కు వచ్చాయని నాయుడు..10:30 నిమిషాలకు విచారణను మొదలు పెట్టారు..శ్యామ్.కె.నాయుడు తన న్యాయవాదితో కలిసి సిట్ ఎదుట హాజరయ్యారు.
డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనే ఆరా తీసినట్టు తెలుస్తోంది. సాయంత్రం 4గంటల వరకు విచారించిన అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. కెల్విన్ ముఠాకు సంబంధించిన వివరాలు, మాదకద్రవ్యాలు కెల్వినే సరఫరా చేసేవాడా? లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా? లాంటి ప్రశ్నల్ని అడిగినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం కొద్దిసేపటి క్రితమే శ్యామ్ కె.నాయుడు సిట్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.

Comments
Post a Comment