సీఎం కేసీఆర్ పై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ వి.హనుమంతరావు

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు… సీఎం క్యాంపు కార్యాలయం (ప్రగతిభవన్) ఎదుట ముగ్గురి ఆత్మహత్యాయత్నానికి సీఎం కేసీఆరే కారణమని… కేసీఆర్‌పై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు వీహెచ్.
సామాన్యుడికి ఏ రూల్ ఉందో సీఎంకీ అదే రూల్ ఉండాలని అన్నారాయన. ప్రగతిభవన్ కట్టింది ప్రజల కోసమా? నీ మనవడి కోసమా? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు వీహెచ్. కాగా, సీఎంను కలిసేందుకు భద్రతాసిబ్బంది అనుమతించకపోవడంతో నిన్న క్యాంపు కార్యాలయం ఎదుట ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు