నగరంలోని రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు పూడ్చి వేయాలి:కేటీఆర్
జిహెచ్‌ఎంసి అధికారులతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి, కాలుష్య నియంత్రణ మండలి,టిఎస్‌ఐఐసి అధికారులతో ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ శనివారం భేటీ అయ్యారు. నగరంలోని చెరువులు, కుంటల్లో కాలుష్య నియంత్రణపై వారితో సమీక్ష చేశారు. కాలుష్య రసాయనాలను అక్రమంగా చెరువుల్లోకి తరలించే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. బయోమెడికల్, వ్యర్థాల నిర్వహణ సరిగా జరిగేలా అధికారులు పని చేయాలని ఆయన సూచించారు. నగరంలోని రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు పూడ్చి వేయాలని కోరారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోన్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment