యూనివర్సిటీల్లో డ్రగ్స్‌పై నిఘా పెట్టాలి : కడియం

యూనివర్సిటీల్లో డ్రగ్స్‌పై నిఘా పెట్టాలి : కడియం


హైదరాబాద్ : డ్రగ్స్ వాడకం, ర్యాగింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై యూనివర్సిటీల్లో నిఘా పెట్టాలని తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి విసిలకు సూచించారు. నాంపల్లిలోని రూసా భవనంలో వర్సిటీల విసిలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్యతో ఆదివారం కడియం సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలు రాజకీయాలకు వేదిక కాకూడదని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో కేవలం చదువు, పరిశోధనలకే స్థానం ఉండాలని చెప్పారు. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. పలు యూనివర్సిటీల్లో 1060 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన తెలిపారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయని ఆయన చెప్పారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు