అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమల సన్నిధికి 48కి.మీ దూరంలో ఎయిర్‌పోర్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమల సన్నిధికి 48కి.మీ దూరంలో ఎయిర్‌పోర్ట్


అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళ సర్కారు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం అయ్యప్ప సన్నిధికి 48 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనుంది. నవంబర్ నుంచి జనవరి మధ్య శబరిమలకు కోట్లాది మంది భక్తులు చేరుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొట్టాయం జిల్లా కంజిరపల్లి తాలూకాలోని చెరువల్లీ ఎస్టేట్‌లో 2,263 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మించేందుకు కేరళ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇక ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, శబరిమల ప్రయాణం మరింత సులువు కానుంది.
ఈ ప్రాంతం రెండు జాతీయ రహదారులకు దగ్గరగా ఉండటంతో పాటు పీడబ్ల్యూడీ రోడ్డుకు దగ్గరగా ఉన్న కారణంగా ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మించాలని కేరళ సర్కారు భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టును నిర్మించడం ద్వారా భక్తులు శబరిమలకు మరింత సులువుగా చేరుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జరిగిన కేరళ మంత్రివర్గ సమావేశం విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం పలికింది.
కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే శబరిమలకు సమీపంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించవచ్చన్న విషయాన్ని నిర్థారించాలని ప్రభుత్వం నిర్ణయించి, మూడు ప్రాంతాలను గుర్తించింది. చివరకు చెరువల్లి ఎస్టేట్‌ను ఎంపిక చేసింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు