డ్రగ్స్ కేసుతో సంబంధమున్న ఎవరినీ వదలొద్దని ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న ఎవరినీ వదలొద్దని ముఖ్యమంత్రి కెసిఆర్… ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కి చెప్పారని సమాచారం. శనివారం ఉదయం సిఎం, అకున్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో సెలవులపై ఉన్న అకున్ సబర్వాల్ కెసిఆర్ సూచనతో తన సెలవులు వాయిదా వేసుకున్నారు.
డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో సెలవులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి, ఆయనకూ చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో అకున్ తన సెలవులను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నా ఎంతటి ప్రముఖులైన వదిలి పెట్టవద్దని సిఎం.. సబర్వాల్‌కు తేల్చి చెప్పారు. కేసులో ఉన్న వారందరి పేర్లను బయటపెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇవాళ మరో వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో మొత్తం అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.

Comments
Post a Comment