బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా




బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా

   బ్రాహ్మణ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అమలు చేస్తామని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డా3క్టర్ కెవి రమణాచారి తెలిపారు. ఆరోగ్య బీమాకు సాలీనా రూ. 4900 అవుతుందని, ఇందులో వెయ్యి రూపాయలను చెల్లిస్తే, మిగిలిన రూ.3900ను పరిషత్ భరిస్తుందన్నారు. ఒక కుటుంబంలో నలుగురికి ఇది వర్తిస్తుందన్నారు. ఈ బీమాను నేషనల్ ఇన్స్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ అమలు చేస్తుందన్నారు. సాలీనా నాలుగు లక్షల రూపాయల కంటే మించి ఆదాయం లేని కుటుంబాలకు ఈ స్కీం వర్తిస్తుందన్నారు. 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ఈ స్కీంలో చేరేందుకు అర్హులని చెప్పారు. శుక్రవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విప్రహిత బ్రాహ్మణ సదన భవనానికి గోపన్నపల్లిలో ఆరు ఎకరాల్లో నిర్మాణానికి శంకుస్ధాపనన చేశామని, రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా అక్షయ నిధి అనే కొత్త స్కీంను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రారంభించింది. ఈ స్కీంకు చైర్మన్ డాక్టర్ రమణాచారి తొలుత రూ. 50 వేలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ రూ1,01,116, డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి రూ. 51వేలు, సి అనిల్ కుమార్ రూ1,01,116ను విరాళంగా ఇచ్చారు. వార్షిక పరీక్షల్లో ప్రతిభ చూపించిన బ్రాహ్మణ విద్యార్ధులకు ఉపకారవేతనం ప్రవేశపెడుతున్నట్లు డాక్టర్ రమణాచారి చెప్పారు. పదవ తరగతిలో ప్రతిభ చూపించిన వారికి రూ. 7500, ఇంటర్ ప్రతిభావిద్యార్ధులకు రూ.10వేలు, డిగ్రీ రూ.15వేలు, పిజి రూ.20వేలు, వృతి విద్యా కోర్సుల్లో ప్రతిభావంతులకు రూ. 25వేలు చెల్లిస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీతో కూడిన నిధులు మంజూరు చేస్తామన్నారు. ఐదు లక్షల సొమ్ములో 75 శాతం, ఐదు నుంచి పదిలక్షల వరకు సొమ్ములో 50 శాతం, 10 నుంచి 25 లక్షల రూపాయల వరకు వ్యయమయ్యే ప్రాజెక్టుకు 30 శాతం సబ్సిడీ చెల్లిస్తామన్నారు. వివిధ పోటీ పరీక్షలు, ఉన్నత చదువులు చదివే వారికి ఆర్ధిక సాయం చేస్తామన్నారు. ఉన్నత విద్యాను అభ్యసించే బ్రాహ్మణ యువత కోసం వివేకానంత విదేశీ విద్య ఉపకార వేతనాల కోసం 32 దరఖాస్తులు రాగా, 29 దరఖాస్తులు పరిశీలనకు స్వీకరించామన్నారు. ఈ అభ్యర్ధులు ఈ నెల 17,18 తేదీల్లో బొగ్గుల కుంటలో పరిషత్ కార్యాలయంలో సెలెక్షన్ కమిటీ ముందు హాజరు కావాలన్నారు. 75 ఏళ్లు దాటిన వృద్ధ పండితులకు నెలకు రూ.2500 పారితోషికం ఇస్తామన్నారు. ఆగస్టు 2వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమాన్ని గోపన్నపల్లిలో బ్రాహ్మణ సదనం నిర్మించే స్ధలంలో చేపడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరిత హారంలో బ్రాహ్మణ బంధువులు పాల్గొనాలన్నారు.

Comments

Post a Comment

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు