లీవ్ రద్దు చేసుకున్న అకున్ సబర్వాల్…
లీవ్ రద్దు చేసుకున్న అకున్ సబర్వాల్…
ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వ్యక్తిగత సెలవును రద్దు చేసుకున్నారు… డ్రగ్స్ కేసు ఊపందుకుంటున్న సమయంలో అకున్‌కు లీవ్ మంజూరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. డ్రగ్స్ కేసు నుంచి ప్రముఖులను తప్పించేందుకు కీలక అధికారిని ప్రభుత్వం లీవ్‌పై పంపుతుందంటూ ఆరోపణలు వ్యక్తమయ్యాయి… మరోవైపు అకున్ సబర్వాల్ లీవ్‌లో ఉన్నప్పుడు ఈ కేసును ఎవరు డీల్ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం.
దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. దాంతో నష్ట నివారణ ప్రారంభించిన ప్రభుత్వం అకున్ సబర్వాల్ వ్యక్తిగత సెలవును రద్దు చేసింది. డ్రగ్స్ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు సెలవు వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు అకున్. ముందుగా నేటి నుంచి ఈ నెల 25వ తేదీవరకు అకున్ సబర్వాల్‌కు వ్యక్తిగత లీవ్ మంజూరైంది. కాగా, డ్రగ్స్ కేసు తీవ్రతతో తన లీవ్‌ను రద్దు చేసుకుంటున్నట్టు అకున్ ప్రకటించారు. విచారణ పూర్తయ్యే వరకు సెలవు వాయిదా వేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Comments
Post a Comment