సోలార్ విద్యుత్‌తో నడిచే మొట్టమొదటి లోకల్ రైలు

న్యూఢిల్లీ: సోలార్ విద్యుత్‌తో నడిచే మొట్టమొదటి లోకల్ రైలును భారతీయ రైల్వే దేశ రాజధానిలో ప్రారంభించింది. దీనిని రైల్వే మంత్రి సురేష్ ప్రభు సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎండ లేని సమయంలో అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు బ్యాటరీ బ్యాంకు వసతి కూడా ఇందులో ఉంది. ఇందులో ఉండే దీపాలు, ఫ్యాన్లు, సమాచార ప్రదర్శన విధానం అన్నీ కూడా డీజిల్ ఎలక్ట్రిక్ మల్లిపుల్ యూనిట్ (డెమో) కోచ్‌లపైనే ఏర్పాటు చేసిన సోలార్ ఫలకాల నుంచి అందే విద్యుత్ ద్వారానే పని చేస్తాయి. భారతీయ రైళ్లను పర్యావరణహితంగా తయారు చేయడంలో ‘ఇది ముందడుగు’గా రైల్వే మంత్రి సురేష్ ప్రభు అభివర్ణించారు. సాధారణంగా ‘డెమో’ రైళ్లు ప్రత్యేక లోకోమోటివ్ లేకుండానే ఆన్ బోర్డ్ ఇంజిన్లతో అనేక రకాల యూనిట్లను కలిగివుంటాయి.
వీటి ద్వారా ప్రయాణికులకు అవసరమైన దీపాలు, ఫ్యాన్లు వంటి వసతులకు డీజిల్ డ్రైవెన్ జనరేటర్ ద్వారా విద్యుత్ అందుతుంది.
మొదటగా దీనిని త్వరలోనే ఢిల్లీ డివిజన్‌లోని సబర్బన్ రైల్వే సిస్టమ్ మీదుగా వాణిజ్య సర్వీసులకు వినియోగిస్తారు. రూట్‌ను తర్వాత నిర్ణయిస్తామని రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి.
1600 హార్స్‌పవర్ సామర్థంతో కూడిన ఈ రైలును చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో తయారు చేశారు. ఇందులోని సోలార్ వ్యవస్థ, ఫలకాలను ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ (ఐఆర్‌ఓఎఎఫ్) తయారు చేసింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు