మీడియా ముందుకు హీరో రవితేజ తల్లి

డ్రగ్స్ కేసు కలకలం: మీడియా ముందుకు హీరో రవితేజ తల్లి

టాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో అగ్ర హీరో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అతడు మరెవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. రవితేజ గురించి ఇలా ప్రచారం మొదలైన నేపథ్యంలో ఆయన తల్లి రాజ్యలక్ష్మి మీడియాముందుకొచ్చారు.
తన కొడుకు గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన మరో కుమారుడు భరత్ ఇష్యూపై కూడా ఆమె మాట్లాడారు. పలు సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.


రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదు

డ్రగ్స్‌ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమని ఆయన తల్లి రాజ్యలక్ష్మి అన్నారు. రవితేజకు కనీసం సిగరెట్‌ అలవాటు కూడా లేదని, అలాంటి వాడిని డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

భరత్ మరణంపై

భరత్‌ మద్యం మత్తులో రోడ్డుప్రమాదంలో చనిపోయాడనేది అవాస్తవమని రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. భరత్‌ చనిపోయే కొద్దిరోజుల ముందే చెడు అలవాట్లను మానేశాడని, బిగ్‌ బాస్‌ షోకు కూడా ఎంపికయ్యాడని ఆమె తెలిపారు.

ఆచారం ప్రకారమే అంత్యక్రియలకు రాలేదు

తమ కుటుంబ ఆచారం ప్రకారమే భరత్‌ అంత్యక్రియలకు తాను హాజరు కాలేదని, కానీ మీడియాలో తమపై మరో రకంగా ప్రచారం జరుగుతోందని ఆమె తెలిపారు.

రవితేజ, భరత్‌ను ముడిపెట్టి చూడొద్దు

ఒకప్పుడు భరత్ డ్రగ్స్ కేసులో ఉన్నాడని... రవితేజను కూడా అదే విధంగా చూడటం సరికాదని రాజ్యలక్ష్మి తెలిపారు. భరత్‌ను దారిలో పెట్టేందుకు తాను రేయింబవళ్లు కనిపెట్టుకుని ఉండేదాన్నని, తర్వాత భరత్ చాలా మారిపోయాడని తెలిపారు.

నష్టపోకూడదనే రవితేజ అలా

సోదరుడి మరణాన్ని చూసి రవితేజ తట్టుకోలేడని, అందుకే చివరి చూపుకు రాలేదని తెలిపారు. తమ్ముడి పోయిన దుఃఖంలో ఉన్నా నిర్మాతలు నష్టపోకూడదన్న కారణంతోనే రవితేజ షూటింగులకు హాజరయ్యాడని రాజ్యలక్ష్మి తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు