ఓటరు నమోదు లో కళాశాల ప్రిన్సిపల్స్ ముఖ్యపాత్ర వహించాలి
జనగామ: కలక్టరేట్ లో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో బుదవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి మాలతి మాట్లాడుతూ ఓటర్ల నమోదు శాతం పెంచేందుకు తమతమ కళాశాలలో 18 సంవత్సరంలు వయస్సు నిండిన వారికి ఓటు హక్కు పై అవగాహన కల్పించాలని, అర్హత కల్గిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, తద్వారా ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి కళాశాలలోను ఒక ఉపాధ్యాయునిని నోడల్ ఆఫీసర్ గా నియమించుకోవాలని, ఉత్సాహవంతులైన ఇద్దరు విద్యార్థులను ఓటర్ల నమోదుకు అంబాసిడార్లుగా నియమించుకోవాలని తెలిపారు. ప్రతి కళాశాలకు వారు కోరిన మేర కొత్తగా ఓటర్ల నమోడుకు అవసరమైన ఫారం-6, ఓటర్ల జాబితాలో తప్పొపులు సవరించేందుకు అవసరమైన ఫారం-8, పోలింగ్ స్టేషన్ల మార్పు చిరునామా మార్పుకు ఫారం-8Aలను ఇస్తామని ఆమె ఈ సందర్భంగా ప్రిన్సిపల్స్ కు తెలిపారు. తేది:01-01-2017 నాటికి 18 సంవత్సరాల వయస్సు, ఆ పైన వున్న వారందరు ఓటరుగా పేరు నమోదుకు అర్హులని అన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం కోసం భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరోల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం) కార్యక్రమం క్రింద పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తగు ఆదేశాలనిచ్చిందని దానిలో భాగమే ఈ కార్యక్రమమని, కళాశాలలో ప్రవేశానికి వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా ఫారం-6 ఇవ్వాలని, అలాగే వసతి పొందుతున్న విధ్యార్థులచే కూడా ఓటర్లుగా నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో నోడెల్ ఆఫీసర్లు గా నియమితులైన వారు విద్యార్థులు పూర్తి చేసిన ఫారం-6 తీసుకొని వారిని ఓటరు గా నమోదుకు రెవిన్యూ అధికారులు తగు సహాయం అందించాలని అన్నారు. మీసేవ ద్వారా, ఆన్ లైన్ లోceotelangana.gov.in వెబ్.సైట్ ద్వారా కూడా ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని ఆమె వివరించారు.

Comments
Post a Comment