అబ్దుల్ కలాం స్మారక మండపం ప్రారంభం
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన అబ్దుల్ కలాం స్మారక మండపాన్ని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం ప్రారంభించారు. రామేశ్వరం సమీపంలోని తంగచ్చిమఠం ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి ఉన్న విషయం తెలిసిందే. అక్కడ కేంద్ర ప్రభుత్వం పదిహేను కోట్ల వ్యయంతో కలాం స్మారక మండపాన్ని నిర్మించింది. గురువారం కలాం రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక మండపాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మండపంలో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించారు. అనంతరం కలాం సమాధి వద్ద మోడీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు, సిఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment