ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన కానుక

రోహిత్ శర్మకు అరుదైన కానుక

ముంబయి: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన కానుక లభించింది. ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్లుడబ్లుఇ) చీఫ్ ఆపరేటింగ్ అధికారి ట్రిపుల్-హెచ్ రోహిత్‌కు రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ బెల్ట్‌ను బహూకరించాడు. ఐపిఎల్ పదో సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు టైటిల్ సాధించి పెట్టడంతో రోహిత్‌కు ఈ అరుదైన బహుమతి లభించింది. ఈ విషయాన్ని భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రపం చంలోనే అత్యంత జనాదారణ కలిగిన రెజ్లర్‌గా ట్రిపుల్-హెచ్‌కు పేరుంది. అతనికి మాత్రం రోహిత్ అభిమాన ఆటగాడు. దీంతో అతనికి అరుదైన బహుమతితో సత్కరించాడు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ ఫైనల్లో పుణెను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్ మిఛెల్ చేతుల మీదుగా రోహిత్ ఈ బెల్ట్‌ను అందుకున్నాడు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు