రైతులకు పంట రుణాలు త్వరితగతిన అందించాలి: జనగామ జిల్లా కలెక్టర్

జనగామ:

రైతులకు వారి పంట సాగుకు అవసరమైన రుణాలను అందించడంలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.శ్రీదేవసేన బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులను కలక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లాలో ఇప్పటి వరకు 32 వెల మంది రైతులకు 390 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ చేయడం, నూతనంగా 75 కోట్ల రూపాయలను కొత్తగా 3000 మంది రైతులకు పంట రుణాలను అందించడం జరుగిందని బ్యాంకర్లు కలెక్టర్ కి వివరించగా, అర్హులైన రైతులoదరికి రుణాలను అందిస్తే ప్రస్తుత తరుణoలో వారిని ఆదుకున్న వారవుతారని అన్నారు. పంట రుణాలను అందించడంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు.  రైతులకు పంట రుణాలను అందించడంతో పాటు, స్వయం ఉపాధి కోసం నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం SCBC, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా పెద్ద మొత్తంలో సబ్సిడీ పై రుణాలను మంజూరి చేస్తోందని, వారికి మంజరి చేసిన యూనిట్ల  గ్రౌండింగ్ గాను నుదులు విడుదల చేయలాని బ్యాంకర్లకు సూచించారు. మహిళాస్వయం సహాయక బృందాలు తమకిచ్చిన రుణాల ద్వారా ఆర్ధికోపాధి పొందుతూ త్వరితగతిన ఎటువంటి జాప్యం లేకుండా రుణాలను తిరిగి బ్యాంకుకు చెల్లిస్తున్నందున వారికి కూడా రుణాలను త్వరితగతిన ఇస్తూ ప్రోత్సహించాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు