అత్యంత ప్రియమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు: సమంత

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ప్రముఖ నటి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అయినా సమంత కేటీఆర్ ఫై పొగడ్తల వర్షం కురిపించింది. తన ట్విట్టర్ ద్వారా ‘‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్’’ అంటూ సమంత ట్వీట్ చేసి కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రజల మనసు దోచుకుంది.సమంత ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వొవెన్2017(చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో) కోసం ఎదురు చూస్తున్నా.’’ అని సమాధానం ఇచ్చారు. అందుకు సమంత ప్రతిస్పందిస్తూ ‘ధన్యవాదాలు సర్’ అని తెలిపింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు