డ్రగ్స్‌కు అనుమతిస్తే … లైసెన్స్‌లు రద్దు

డ్రగ్స్‌కు అనుమతిస్తే … లైసెన్స్‌లు రద్దు


హైదరాబాద్ : పబ్, బార్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లలో డ్రగ్స్‌కు అనుమతిస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. హైదరాబాద్ జంటనగరాల్లోని కొన్ని పబ్‌లు, హోటళ్లు, బార్లు డ్రగ్స్‌ను అనుమతిస్తున్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం అకున్ సబర్వాల్ ఆయా యాజమాన్యాలతో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల సేపు ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పబ్‌లకు, హోటళ్లకు, బార్లకు డ్రగ్స్ విషయంలో అకున్ సబర్వాల్ మార్గ నిర్దేశనం చేశారు. తమ హోటళ్ల ముందు డ్రగ్స్‌ను నిషేధించినట్టు బోర్డులు పెట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, అదనపు కమిషనర్ రాజశేఖర్, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. సినీ ప్రముఖులను రోజుకొకరి చొప్పున సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జంట నగరాల్లోని పబ్‌లు, హోటళ్లు, బార్లపై ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా పెట్టారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు