ప్రపంచ కప్ క్రికెట్ లో మిథాలీ సేన విజయం కోరుతూ హోమం

మిథాలీ సేన విజయం కోరుతూ హోమం


ఢిల్లీ: మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో మిథాలీ సేన నేడు ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ మైదానంలో తలపడనుంది. ప్రపంచకప్‌ టైటిల్‌కు ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్న భారత మహిళల జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి దేశానికి కప్‌ తీసుకురావాలని దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మిథాలీసేనకు శుభాకాంక్షలు చెబుతూ పలుచోట్ల ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.
భారత జట్టు విజయాన్ని కాంక్షిస్తూ వారణాసిలో అభిమానులు భారీ హోమం నిర్వహించారు. హోమగుండం చుట్టూ జాతీయ జెండాలను చేతపట్టుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెమీస్‌లో ప్రదర్శించిన దూకుడునే ఫైనల్‌లో ప్రదర్శించి కప్‌ గెలవాలని అభిమానులు కోరారు.
రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ ఫైనల్‌లో రెండోసారి అడుగుపెట్టిన టీమిండియా ఈ సారి తప్పకుండా కప్‌ గెలవాలని పట్టుదలగా ఉంది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు