తప్పుడు కథనాలతో నా జీవితాన్ని నాశనం చేశారు: పూరి జగన్నాథ్
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సిట్ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తను తీవ్రంగా బాధించాయని పూరీ జగన్నాథ్ అన్నారు. "తప్పుడు కథనాలతో నా జీవితాన్ని నాశనం చేశారు. మా ఫ్యామిలీ వాళ్లంతా ఏడుస్తున్నారు" అని పేర్కొన్నారు.
పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే తనకెంతో ఇష్టమని, అందుకే వాళ్లపై చాలా సినిమాలు తీశానని పూరీ చెప్పుకొచ్చారు. మీడియాలో అందరూ తనకు తెలిసినవాళ్లే అయినా, కష్టకాలంలో టార్గెట్ చేయడం బాధకలిగించిందని అన్నారు. వ్యక్తిగతంగా తాను బాధ్యతాయుతంగా ఉంటానని, డ్రగ్స్ విషయంలోనేకాదు మరే ఇతర విషయాల్లోనైనా ఇకపై జాగ్రత్తగా ఉంటానన్నారు.

Comments
Post a Comment