నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీ బలపరీక్షలో విజయం
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ అసెంబ్లీలో శుక్రవారంనాడు జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మొత్తం 59లో 47 మంది జెలియాంగ్‌కు మద్దతుగా నిలిచారు. రెండ్రోజుల క్రితం నాగాలాండ్ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. శాసనసభలో బలపరీక్షకు ముఖ్యమంత్రి లీజిత్సు హాజరుకాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్‌ను గవర్నర్ బీపీ ఆచార్య ఆదేశించారు. దీంతో కొత్త సీఎంగా జెలియాంగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 22లోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని జెలియాంగ్‌ను గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జెలియాంగ్ శుక్రవారంనాడు జరిగిన బలపరీక్షలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. కొద్దిరోజులుగా నాగాలాండ్ సంక్షోభం ముదిరిపాకాన పడుతూ వచ్చింది. 47 మంది ఎమ్మెల్యేలు తనకే మద్దతిస్తున్నందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని జెలియాంగ్ గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో జూలై 15లోపు అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని సీఎం తీజిత్సుకు గవర్నర్ చూపించారు. గవర్నర్ నిర్ణయాన్ని తీజిత్సు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. గువాహటిలోని కోహిమా బెంచ్ న్యాయస్థానం గవర్నల్ ఆదేశాలపై జూలై 17వరకూ స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో బలపరీక్షకు సిద్ధం కావాలని సీఎం లీజిత్సును గవర్నర్ సూచించారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి లీజిత్సు, ఆయన మద్దతుదారులు హాజరుకాలేదు. దీంతో కొత్త సీఎంగా జెలియాంగ్‌ను ప్రకటిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

Comments
Post a Comment