నేటి నుండి పీకేఎల్ ఐదో సీజన్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో శుక్రవారం పీకేఎల్ ఐదో సీజన్‌కు తెరలేవనుంది. గత నాలుగు సీజన్లలో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్న పీకేఎల్ ఐదో సీజన్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. కొత్తగా 4 జట్లు చేరడంతో మొత్తం 12 జట్లు 13 వారాల పాటు 138 మ్యాచ్‌లతో హోరెత్తించనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా పైరేట్స్ హ్యాట్రిక్‌పై కన్నేయగా.. జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా రెండో టైటిల్‌పై గురిపెట్టాయి. తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, బంగాల్ వారియర్స్ మొదటిసారి ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్ళూరుతుండగా..
తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్, గుజరాత్ ఫార్చున్ జెయింట్స్, యూపీ యోధా అరంగేట్ర సీజన్‌లోనే అదరగొట్టాలని కృతనిశ్చయంతో బరిలో దిగుతున్నాయి. మరి ఏ జట్టు మెరుస్తుందో.. ఏ అభిమానులు మురుస్తారో అక్టోబరు 28న జరిగే ఫైనల్లో తేలిపోతుంది!
ఆరంభోత్సవానికి తారలు: శుక్రవారం గచ్చిబౌలీ స్టేడియంలో తారల సందడి కనిపించనుంది. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పీకేఎల్ ఐదో సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, తారల నృత్యాలు అభిమానుల్ని అలరించనున్నాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ జాతీయ గీతం ఆలాపించనున్నాడు. సచిన్ తెందుల్కర్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్, చిరంజీవి, రాణా దగ్గుబాటి, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తదితరులు ఆరంభోత్సవానికి రానున్నారు.

Comments
Post a Comment