ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16 సర్పంచ్‌లు, 4 ఎంపీటీసీ, 133 వార్డుమెంబర్ల స్థానాలకు ఈసీ ఎన్నికల ప్రకటనను విడుదల చేసింది. ఆయా స్థానాలకు వచ్చే నెల 13న ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు పేర్కొంది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల వివరాలిలా ఉన్నాయి.
సర్పంచ్ స్థానాలు..
- ఆదిలాబాద్ జిల్లా అంతర్గామ్
- కరీంనగర్ జిల్లా ముంజంపల్లి, రామచంద్రపూర్
- ఆసిఫాబాద్ జిల్లా మంగి
- మహబూబ్‌నగర్ జిల్లా బుద్దారం, కోటకదిర
- మెదక్ జిల్లా వెంకటాపూర్
- సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్, సత్యగామ
- నల్లగొండ జిల్లా మైనంపల్లి, రాజుపేట
- నిజామాబాద్ జిల్లా బెజ్జోర
- రాజన్న సిరిసిల్ల జిల్లా నరసింగాపూర్
- సిద్దిపేట జిల్లా సముద్రాల, తిమ్మారెడ్డిపల్లి
- సూర్యాపేట జిల్లా గోల్తండా సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
- రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం పహాడీషరీఫ్ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ
ఎంపీటీసీ స్థానాలు..
- జిగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం-2
- జోగులాంబ జిల్లా కాలూర్ తిమ్మాన్‌దొడ్డి
- మహబూబ్‌నగర్ జిల్లా చేగుంట
- నల్లగొండ జిల్లా శివన్నగూడెం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు