‘తల్లిలాంటి పార్టీని వీడటం బాధాకరం’

‘తల్లిలాంటి పార్టీని వీడటం బాధాకరం’


ఢిల్లీ: పెద్దల సభ గౌరవం మరింత పెంచేలా వ్యవహరిస్తానని ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. ఎన్‌డిఎ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు వెంకయ్యనాయుడు నామినేషన్ వేసిన అనంతర మీడియాతో మాట్లాడారు. తల్లిలాంటి పార్టీ తనని ఇంతవాడిని చేసిందని, ఇంతవాడిని చేసిన బిజెపి పార్టీని వీడటం బాధగానే ఉందని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి బాధ్యతను అంగీకరించడం లేదన్న ప్రచారం వాస్తవం కాదని వెల్లడించారు. తాను ఇష్టపూర్యకంగా బాధ్యతలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. రాజ్యాంగ నియమ నిబంధనలు, ఆదర్శాలకు లోబడి బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చానని, తనకు ఘనమైన చరిత్రేమీ లేదని చెప్పారు. తనకు మద్దతిచ్చిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు