రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్ విజయం

రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్ విజయం



ఢిల్లీ : భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ విజయం సాధించారు. 65.65 ఓట్ల శాతం మెజార్టీతో ఆయన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌పై విజయం సాధించారు. మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు లభించాయి. భారీ మెజార్టీతో రామ్‌నాథ్ కోవింద్ విజయం సాధించడంతో ఎన్‌డిఎ కూటమిలో ఆనందనం వెల్లువిరిసింది. ఈనెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఈనెల 25వ తేదీన భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు ఎన్‌డిఎ పక్షాలతో పాటు ప్రధాని మోడీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలతో సహా పలు పార్టీలు అభినందనలు తెలిపాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు