సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు టీఆర్‌ఎస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. కాబట్టి ఆయనకు మద్దతుగా వేసే పార్టీ ఎమ్మెల్యేల ఓట్లలో ఒక్కటి కూడా వృథా కాకుండా చూసేందుకు, ఆ మేరకు వారికి అవగాహన కల్పించడానికి మాక్ పోలింగ్ ఏర్పాటు చేశారు.
మాక్ పోలింగ్ అనంతరం.. ఎమ్మెల్యేలకు విద్యార్థివిభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. విద్యార్థి విభాగం నాయకులకు నియోజకవర్గస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని శాసనసభ్యులకు కేసీఆర్ సూచించారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్వీ సభ్యత్వనమోదు, నియోజకవర్గాల కమిటీలు, కాలేజీ, యూనివర్సిటీల కమిటీల ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని సీఎం చెప్పారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు