బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ ప్రమాదం

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో ‘మణికర్ణిక- ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ అనే మూవీ లో నటిస్తున్న సంగతి తెల్సిందే.. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టుకోగా , ప్రస్తుతం కంగనా తన సహనటుడు నిహర్‌ పాండేతో కత్తి సాము చేస్తుండగా కంగనా నుదురుపై కత్తి గాటు పడింది.

దాంతో వెంటనే చిత్ర యూనిట్ ఆమెని అపోలో ఆస్పత్రికి తరలిచింది. కంగనా ముఖానికి 15 కుట్లు పడినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. రెండు వారాల పాటు కంగనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కంగనాకు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకుందని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తుంది. మాములుగా అయితే ఇలాంటి కత్తి సాములు ఎక్కువగా డూప్ సాయం తీసుకుంటారు కానీ.. కంగనా ఎలాంటి డూప్‌ లేకుండా చేస్తానని చెప్పిందని… కత్తిసాము చేయడానికి చాలాసార్లు ప్రయత్నించిందని.. ఈసారి గురి తప్పిందని నిర్మాత కమల్‌ జైన్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు