డ్రగ్స్‌‌ వ్యసనాలకు బానిసలగా మారడం బాధకలిగించిందన్నారు.

: డ్రగ్స్ కేసుపై స్పందిస్తూ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనాంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ ఇండస్ట్రీలో కొందరు డ్రగ్స్‌‌ వ్యసనాలకు బానిసలగా మారడం బాధకలిగించిందన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన.. డ్రగ్స్ అనేది ఇంతక ముందు, ఇప్పటి వరకు జరిగిన అనుభవాన్ని తీసుకుంటే.. ఫస్ట్ క్లాస్ ఆర్టిస్టుల్లో ఎవ్వరూ ఇలాంటివి తీసుకోరు.. సెకండ్, థర్డ్ గ్రేడ్ ఆర్టిస్టులు ప్రస్టేట్ అయిపోయి ఇలా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మామూలు వ్యక్తుల కన్నా పదిరెట్టు బాధ్యత కలిగిన వాళ్లు కళాకారులు. కళాకారుడనే వ్యక్తి సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పేవాళ్లలో తాను ఒక్కడినని ఆయన చెప్పారు. జీవితంలో ఏదో జరగాలని వారు ఊహించుకుంటారు.. అది జరగకపోయినంత మాత్రాన ఇలా వ్యసనాలకు బానిస అయితే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ఏదైనా ఒక్కటి అవ్వాలంటే.. అందుకు ఏం చేస్తే ఆ స్థాయికి ఎదుగుతామో దాన్ని ఎంచుకోవాలే తప్ప పిచ్చిరూట్లకు ఎంచుకోవడం మంచిది కాదని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. డ్రగ్స్ అనేది తాత్కాలిక ఆనందం అని ఎవరైనా ఫీలయితే గనుక అది శాశ్వతంగా జీవితాన్ని నాశనం చేస్తుందని.. దయచేసి ఎవరూ వాటిని తీసుకోవద్దని సినీ ఇండస్ట్రీకి ఆయన సూచించారు. హాయిగా పక్కనోళ్లను నవ్వించండి.. ఆ కిక్కు ముందు ఈ డ్రగ్స్ కిక్కెంత అని ఊల వేసి సరదాగా చెప్పారు రాజేంద్ర ప్రసాద్. నాకైతే ప్రేక్షకులను నవ్వించడంలోనే కిక్ ఉంటుందని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు