పురిటి నొప్పులతో ఉన్న గర్భిణిని 16 కిలోమీటర్లు మోసుకెళ్లారు


 పురిటి నొప్పులతో ఉన్న గర్భిణిని 16 కిలోమీటర్లు మోసుకెళ్లారు…


ఆర్థిక స్తోమతలేక భుజంపై శవాలను మోయడం, పురిటి నొప్పులతో గర్భిణి 15 కిలోమీటర్లు పైగా నడిచిన ఘటనలు చూశాం… ఒడిశాలో ఆలాంటి ఘటనే మరోటి వెలుగుచూసింది… గర్భిణీ స్త్రీల సంరక్షణకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా మౌలిక సదుపాలు, దానికి తోడు ప్రకృతి కోపంతో ఏకంగా 16 కిలోమీటర్ల దూరం గర్భిణిని మోసుకెళ్లాల్సి వచ్చింది. ఒడిశాలోని నియమ్‌గిరి పర్వత ప్రాంతాల్లోని కాచ్‌బండెల్ గ్రామం నుంచి సదరు గర్భిణిని భుజనాలపైనే 16 కిలోమీటర్లు తీసుకెళ్లారు.
ఆదివాసీ గర్భిణిని ఆస్పత్రికి చేర్చడానికి 16 కిలోమీటర్ల దూరం అత్యంత కష్టంపై మరో వ్యక్తి సహాయంతో గర్భిణి భర్త మోసుకెళ్లారు. ఆ గర్భిణిని ఓ బట్టలో పడుకోబెట్టి… ఓ కర్రకు కట్టి ఆ ఇద్దరు తమ భుజాలపై పెట్టుకుని 16 కిలో మీటర్ల దూరం మోశారు. ఆస్పత్రికి చేర్చడానికి 102 అంబులెన్స్ సర్వీస్‌కు సమాచారం ఇచ్చినా వర్షాల కారణంగా చెట్లు కూలి అది చేరుకోని పరిస్థితి వచ్చింది. దీంతో 16 కిలోమీటర్లు ఆ గర్భిణి తీసుకెళ్లారు… అనంతరం అంబులెన్స్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి చేర్చారు. అనంరతం డాక్టర్ సంజయ్ బెహ్రా మాట్లాడుతూ ఆదివాసీ స్త్రీ సంగారి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారని తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు