అద్భుతం 2017, ఆగస్టు21న జరగబోతుంది: నాసా ప్రకటన

విశ్వంలో జరిగే మార్పులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి అరుదైన అద్భుతం 2017, ఆగస్టు21న జరగబోతుందని నాసా ప్రకటించింది. 99 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతుందని తెలిపింది నాసా. అమెరికాలోని 14 రాష్ట్రాల్లో ఈ సూర్య గ్రహణం ఏర్పడనుంది.2017 ఆగస్టు 21న వచ్చే సూర్యగ్రహనం అరుదైనదని.. ఖగోళ అద్భుతంగా అభివర్ణించింది నాసా. మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశమని, 99 సంవత్సరాల్లో ఇది మొదటిదని చెప్పింది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమికి మధ్య నుంచి చంద్రుడు దాటుతూ ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో ఆకాశంలో కనిపించడని పేర్కొంది నాసా. గంటన్నర పాటు ఈ సూర్యగ్రహణం ఉంటుందట.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఖగోళ అద్భుతాన్ని 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది వీక్షించనున్నట్లు అంచనా వేసింది నాసా. ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రత ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా ఎక్లిప్‌ గ్లాసెస్ లేదా హ్యాండ్‌ హెల్డ్‌ సోలార్ వ్యూయర్ వంటి సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది. గ్రహణం కారణంగా ఆగస్టు 21న అమెరికా అంతటా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మాయం కానున్నాడు. గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ గ్రహణం పోర్ట్‌లాండ్‌ నుంచి ఓరెగాన్‌ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్‌ దగ్గర సూర్యుడు మాయమయ్యి చీకటి ఆవరిస్తుంది. రెండు నిమిషాలపాటు ఆకాశంలో చుక్కలు కూడా కనిపిస్తాయట. 99 సంవత్సరాల క్రితం, 1918, జూన్‌ 8వ తేదీన వాషింగ్టన్‌ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. ఆ తరువాత 2017, ఆగస్ట్ 21న రాబోతుంది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు