డ్రగ్ కేసుపై స్పందించిన రాంగోపాల్ వర్మ
హైదరాబాద్: డ్రగ్ కేసుపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మొదట ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై అమరేంద్ర బాహుబలిలా పేరు సంపాదిస్తున్నారంటూ వెటకారంగా మాట్లాడారు. అయితే ఇలా కామెంట్స్ చేసిన కొన్ని గంట వ్యవధిలోనే తన మాటమార్చుకున్నారు వర్మ.
నేను అబ్కారీ శాఖ పనితనాన్ని, అకున్ వ్యక్తిత్వాన్ని కించపరచడం లేదని… కానీ డ్రగ్ కేసులో టాలీవుడ్ ను ఎక్సైజ్ శాఖ.. సినిమా టీజర్, ట్రైలర్ మాదిరిగా వాడుకుంటున్నారని విమర్శించారు. తాను మొదట పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. అయితే ప్రస్తుతం సినీ తారలను హైలైట్ చేస్తూ సాగుతున్న విచారణ.. ఆ తరువాత స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తార అని వర్మ ప్రశ్నించారు.

Comments
Post a Comment