పైసావసూల్ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా గడుపుతున్నాను: అంటూ పూరీ జగన్నాథ్

డ్రగ్స్ కేస్:  తాజాగా ఈ వ్యవహారంపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా తన స్పందనను వెల్లడించారు. ‘‘ఏ విషయంపైనా, ఎవరి గురించీ నేను ఏ ప్రకటనా చేయలేదు. నేను నా పనిలో బిజీగా ఉన్నాను. పైసావసూల్ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా గడుపుతున్నాను’’ అంటూ పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు. కాగా, ఎక్సైజ్ సిట్ నోటీసులు జారీ చేసిన సినీ ప్రముఖుల్లో పూరీ జగన్నాథ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. డ్రగ్స్ వ్యవహారం అని కాకుండా పూరీ పరోక్షంగా దానిపై స్పందించడం గమనార్హం.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు