లాలూ ప్రసాదవ్ యాదవ్ ఇంట్లో సీబీఐ దాడులు




లాలూ ప్రసాదవ్ యాదవ్ ఇంట్లో సీబీఐ దాడులు

పాట్నా: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లో శుక్రవారం ఉదయం నుంచీ సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, పాట్నా, రాంచీ, పూరీ, గుర్గావ్‌ సహా 12 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది.
2006లో బీఎన్‌ఆర్‌ హోటళ్ల కోసం టెండర్ల కేటాయింపులో జరిగిన అవకతవలపై లాలూ సహా ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజశ్వీ ప్రతాప్‌, ఐఆర్‌సీటీసీ ఎండీ పీకే గోయల్‌, లాలూ సహచరుడు ప్రేమ్‌ చంద్‌ గుప్తా, అతని సతీమణి సుజాత తదితరుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
కాగా, పాట్నాలోని స్థలాన్ని యాదవ్‌ కుటుంబీకులకు అక్రమంగా ఇచ్చేశారన్నది సీబీఐ ఆరోపణ. 2006లో హర్ష్‌ కొచ్చర్‌ అనే వ్యాపారవేత్తకు పూరీ, రాంచిలోని రైల్వేస్‌లో హోటళ్లు నడుపుకునేందుకు స్థలాలు ఇచ్చినందుకు గానూ అప్పుడు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్‌కి కొచ్చర్‌ రెండు ఎకరాల స్థలాన్ని రాసిచ్చినట్లు సీబీఐ స్పష్టం పేర్కొంది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు