ఉత్తమ హరిత విద్యా సంస్థలకు బహుమతులు : కడియం

ఉత్తమ హరిత విద్యా సంస్థలకు బహుమతులు : కడియం


హైదరాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటిని బాగా పరిరక్షించిన విద్యా సంస్థలను ఉత్తమ హరిత విద్యా సంస్థగా గుర్తించి వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ప్రతీ పాఠశాలల్లో మొక్కలు నాటేటప్పుడే ఒక్కో మొక్కను సంరక్షించే బాధ్యత ఒక్కో విద్యార్థికి అప్పగిస్తున్నామన్నారు. విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ అధికారులతో కడియం శ్రీహరి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కడియం మాట్లాడుతూ మంచిగా మొక్కలను పరిరక్షించిన విద్యార్థికి కూడా బహుమతులు ఇస్తామన్నారు. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహనను పెంచే విధంగా హరితహారాన్ని పాఠ్యాంశంగా రూపొందించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది విద్యా సంస్థల్లో 42 లక్షల మొక్కలు నాటినట్లు కడియం వెల్లడించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు