అమర్నాథ్ దాడి నిందితుడు ఫోటో విడుదల చేసిన పోలీసులు
అనంతనాగ్: పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారైనఇస్మాయిల్ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. దాడిలో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా మరో 11 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులని కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ మంగవారం మీడియా ద్వారా వెల్లడించారు. ఇస్మాయిల్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఐజీ పేర్కొన్నారు.

Comments
Post a Comment