డీఎస్పీని హత్య చేసిన ఉగ్రవాది హతం

డీఎస్పీని హత్య చేసిన ఉగ్రవాది హతం


శ్రీనగర్‌లోని జామియా మసీదు ముందు గత నెల 22 న డీఎస్పీ అయూబ్ పండిట్‌పై దాడిచేసి దారుణంగా కొట్టి చంపిన కేసులో ప్రధాన సూత్రధారి, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాది సాజిద్ అహ్మద్ గిల్కర్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. జామియా మసీదు ప్రాంతంలో విధులు నిర్వహిస్తోన్న ఆయూబ్ పండిట్‌ హత్య, ఏప్రిల్ 22 న నౌహట్టాలోని సీఆర్పీఎఫ్ దళాలపై గ్రనేడ్ దాడి కేసుతో పాటు, అదే నెల 30న ఖాన్యార్‌లో పోలీసు పార్టీపై దాడి, జూన్ 21న సఫాకదల్ క్యాంపుపై దాడి కేసులో సాజిత్ ప్రధాన నిందితుడు. అలాగే ఏప్రిల్ 1 న బెమీనా ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, మే 24 న పీడీపీ నాయకుడు అబ్దుల్ ఖయూమ్‌పై దాడిలో సాజిద్ ప్రధాన పాత్ర పోషించాడు.

తన అనుచరులు ఆఖిబ్ గుల్, జావేద్ అహ్మద్ షేక్‌లతో కలసి సాజిద్ అనేక నేరాలకు పాల్పడ్డాడని, అతడు ఆశ్రయం పొందిన ఇంటి వివరాలను తెలుసుకుని దాడిచేసి మట్టు బెట్టామని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సైన్యంపై సాజిద్ ఎదురు కాల్పులు జరిపాడని, రాత్రంతా ఎన్ కౌంటర్ సాగిందని అన్నారు. అతడు తప్పించుకు పారిపోవాలని ప్రయత్నిస్తే భద్రతా దళాలు కాల్చి చంపాయని వెల్లడించారు. ఈ ఘటనలో సాజిద్‌తో పాటు అతడి అనుచరులు అఖిబ్ గుల్, జావేద్‌లు కూడా హతమయ్యారని తెలియజేశారు. బుద్గామ్ జిల్లాలోని రాడ్‌బుగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు