సంతోష్ శివన్ కెమెరాలో మహేష్ బాబు కూతురు సితార
ప్రిన్స్ మహేష్ బాబు సెట్స్ లలో సందడి చేస్తాడో లేదో తెలియదు కానీ జూనియర్ ప్రిన్స్ గా పిలువబడే సితార మాత్రం సెట్స్ లలో చేసే సందడి మాములుగా ఉండదని అంటున్నారు హీరోయిన్స్..టైం దొరికినప్పుడల్లా సితార తన తల్లి ని వెంట పెట్టుకొని సెట్స్ కు వస్తుందట..తన తండ్రి ఎలా నటిస్తున్నాడా దగ్గరి నుండి చూస్తూ తెగ సంబరపడుతుందట.. తన తండ్రి సినిమాలోని పాటలకు స్పెప్పులేయడమే కాదు, డైలాగులను కూడా ముద్దుగా ముద్దుగా చెపుతోందట.
తాజాగా మహేష్ మూవీ షూటింగ్ కి వెళ్ళిన సితార అక్కడ తండ్రితో కలిసి అనేక ఫోజులిచ్చింది. చిత్ర హీరోయిన్ తో రకుల్ తో సరదాగా గడిపింది. వెంటనే ఈ సన్నివేశాలను చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Comments
Post a Comment