నా భర్త చాలా మంచోడు... అవన్నీ వదంతులే : వరుణ్ సందేశ్ భార్య వితిక




టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేర్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనిపై ఆమె స్పందించింది. తన భర్త చాలా మంచోడని, తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. వరుణ్ సందేశ్ తనను చాలా బాగా చూసుకుంటున్నాడని తెలిపింది.
తన స్నేహితులతో కలిసి మాదాపూర్‌కి డిన్నర్‌‍కి వెళ్లానని... ఈలోగా తన పిన్ని, ఇతర స్నేహితులు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి చెబుతూ... 'సూసైడ్ అటెంప్ట్ చేశావా?' అని అడుగుతున్నారని, దాంతో ఆశ్చర్యపోయానని చెప్పింది.
గతంలో నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయినప్పుడు డోస్ ఎక్కువై ఆసుపత్రి పాలయ్యానని, అప్పటి ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేస్తూ, తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని, తనను ఆసుపత్రిలో చేర్చారని పుకార్లు రేపారని, వాటిని చూసి సందేశ్, తాను నవ్వుకున్నామని ఆమె తెలిపింది. పైగా, వరుణ్ సందేశ్ వంటి భర్త తనకు దొరకడం చాలా సంతోషమని వితికా శేర్ చెప్పుకొచ్చింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు