మూడవ విడత అమరవీరుల యాత్రలో టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
రైతులు తాము కష్టించి పండించిన ధాన్యం డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. మండలంలోని వీర్నపల్లి గ్రామంలో ఆదివారం మూడవ విడత అమరవీరుల యాత్రలో భాగంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రైతులు తాము ఆరుగాళం కష్టించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరుపుకుంటే అట్టి డబ్బులను తీసుకునేందుకు బ్యాంకుల వద్ద రోజుల తరబడి వడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. తెలంగాణ సిద్దించాక
విద్యార్ధుల సమస్యలు పెరిగిపోయాయని, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ధర్నా చౌక్ వద్ద తెలియజెప్పే సంస్కృతికి తెరాస ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేయవద్దని ధర్నా నిర్వహించాల్సి వస్తే
పోలీసులతో అడ్డుకున్నారన్నారు. మిషన్ కాకతీయ పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందన్నారు. తెగిన చెరువుల మరమ్మత్తులు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

Comments
Post a Comment