జేసీని విమానం నుండి దించేశారు..

జేసీని విమానం నుండి దించేశారు..

అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కి చేదు అనుభవం ఎదురయింది. నిన్న రాత్రి హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. టికెట్‌ తీసుకుని స్పైస్‌జెట్‌ విమానంలో ఎక్కిన తరువాత ఆయ‌నపై నిషేదం ఉందని తెలుసుకున్న సిబ్బంది కిందికి దించివేశారు.

ఈరోజు ఉదయం విజయవాడ వెళ్లేందుకు ట్రూజెట్‌ విమాన టికెట్ తీసుకున్నారు. ఆయన విమనాశ్రయానికి వెళ్లకముందే ట్రూజెట్‌ మేనేజర్‌ జేసీకి ఫోన్‌ చేసి నిషేధం ఉన్నందున‌ తాము తీసుకెళ్లలేమని వివరించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేది ఏమి లేక ఉండిపోయారు గ‌త నెల 15న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో ఇండిగో విమాన సిబ్బందితో గొడవ పడడంతో ఆయనపై దేశీయ విమాన సంస్థ‌లు నిషేధం విధించాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు