హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన ఫోటో 'ఆటగదరా శివా' అనే సినిమాకి సంబంధించింది.

హైపర్ ఆది పెళ్లి సినిమాలో భాగమే!

'జబర్దస్త్' కార్యక్రమంలో కొన్ని కామెడీ బృందాలు స్కిట్లు చేస్తూ తెగ నవ్వించేస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమం చాలామంది కమెడియన్స్ ను పరిచయం చేసింది. అలా ఈ కార్యక్రమంతో పాప్యులర్ అయిన నటుడు 'హైపర్ ఆది'. తాజాగా నెట్టింట్లో ఆయన పెళ్లి ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. కుటుంబ సభ్యులకు గానీ .. స్నేహితులకు గాని తెలియకుండా రహస్యంగా ఆయన వివాహం చేసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఈ విషయంపై చాలా చోట్ల చర్చలు జరుగుతూ ఉండగానే .. ఈ పెళ్లి ఉత్తుత్తిదేనని తేలిపోయింది. హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన ఫోటో 'ఆటగదరా శివా' అనే సినిమాకి సంబంధించిందని స్పష్టమైంది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం కోసమే సరదాగా ఈ పెళ్లి ఫోటోను వదిలామని ఆ చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ చెప్పాడు. దాంతో హడావిడిగా నడుస్తోన్న చర్చలకు హఠాత్తుగా ఫుల్ స్టాప్ పడిపోయింది.  

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు