ఇజ్రాయెల్ పుష్పానికి ‘మోడీ’ పేరు

ఇజ్రాయెల్ పుష్పానికి ‘మోడీ’ పేరు

ఇజ్రాయెల్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం ఇజ్రాయెల్ చేరుకున్న మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధానికి ఇజ్రాయెల్ అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ దేశంలో ప్రసిద్ధి చెందిన క్రైసాంతిమమ్ అనే పుష్పానికి మోడీ పేరు పెట్టారు. ఈ విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇక పర్యటనలో భాగంగా మోడీ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి డాంజిగర్ పూలతోటను సందర్శించారు. కాగా, ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు