పాక్ పై భారత్ మహిళ క్రికెట్ ఘన విజయం

డెర్బీ: మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన పాక్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ పరాజయం పాలైంది. పాక్ బ్యాట్స్ విమెన్‌లలో కెప్టెన్ సానా మిర్ చేసిన 29 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. పాక్ జట్టులో నలుగురు బ్యాట్స్ విమెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా ఇద్దరు మాత్రం ఒక్కో పరుగు చేశారు. ఫలితంగా 33 ఓవర్లలోనే పాక్ కథ ముగిసింది. మొత్తంగా 38.1 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిష్త్ 5 వికెట్లు పడగొట్టి పాక్ పరాజయాన్ని శాసించింది. జులన్ గోస్వామి, దీప్తి మిశ్రా, హర్మన్ ప్రీత్ కౌర్ చెరో వికెట్ నేల కూల్చగా, మాన్షి జోషి రెండు వికెట్లు నేల కూల్చింది.
 
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్ పూనమ్ రౌత్ 47, దీప్తి మిశ్రా 28, సుష్మా వర్మ 33, జులన్ గోస్వామి 14 పరుగులు చేశారు. వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలోనూ ఘన విజయాలు సాధించింది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు