బీసీసీఐకి వినోద్ రాయ్ ఆదేశం
బీసీసీఐకి వినోద్ రాయ్ ఆదేశం
దిల్లీ : టీమిండియా కొత్త కోచ్ కోసం నిన్న క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి కోచ్ ప్రకటనను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం.. కోహ్లీతో మాట్లాడాకే కొత్త కోచ్ను ప్రకటిస్తామని సీఏసీ స్పష్టం చేయడంపై బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రంలోగా కొత్త కోచ్ పేరును వెల్లడించాలని ఆయన బీసీసీఐని ఆదేశించినట్లు సమాచారం.
కొత్త కోచ్ అంశంపై వినోద్ రాయ్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కొత్త కోచ్ ప్రకటనను వాయిదా వేయొద్దని, మంగళవారం సాయంత్రంలోగా ప్రకటించాలని రాయ్ ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Comments
Post a Comment